Tuesday, November 10, 2026
Homeతెలంగాణదామెరా గ్రామములో బీజేపీ లో చేరికలు !

దామెరా గ్రామములో బీజేపీ లో చేరికలు !

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామెరా గ్రామములో బీజేపీ లో చేరికలు !కమలం గూటికి చేరిన దామెర నాయకులు 

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా చేరికల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈరోజు సిద్ధిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎల్కతుర్తి మండలం దమెరా గ్రామానికి చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు బీజేపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన దమెరా గ్రామ నాయకులు: ఒద్దుల రవి ఒద్దుల సంపత్ పిప్పల విజేందర్ పండ్రాల రమేష్ కోప్పర ప్రభాకర్ కోప్పర సంబరాజు సాతురి వరుణ్ ఠాకూర్ రోహిత్ సింగ్

ఈ కార్యక్రమంలో దమెరా శక్తి కేంద్ర ఇన్‌చార్జి శామ్ సింగ్, సాతురి ప్రభాకర్, చల్ల రవీందర్ రెడ్డి, పండ్రాల సదానందం, పండ్రాల రాజయ్య, నామిండ్ల ప్రవీణ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, ఎల్కతుర్తి మండలంలోని ప్రతి గ్రామంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.

ఎల్కతుర్తి మండలంలో కమలం వికాసం… బీజేపీ వైపు ప్రజల అడుగులు!

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.