Sunday, October 25, 2026
Homeతెలంగాణరక్తదానమే ప్రాణదానమనే నినాదంతో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని

రక్తదానమే ప్రాణదానమనే నినాదంతో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని

📰 Generate e-Paper Clip

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న దండేపల్లి ఆటో యూనియన్

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఈ కార్యక్రమం మడికొండ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ ల నిర్వహించడం జరిగింది రక్తదానమే ప్రాణదానమనే నినాదంతో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరంలో దండేపల్లి ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాల్లో పాల్గొంటున్నామని యూనియన్ అధ్యక్షుడు మాచర్ల శంకర్ తెలిపారు.

ఈ సందర్భంగా మాచర్ల శంకర్ అధ్యక్షతన, ఉపాధ్యక్షుడు కొంగ ప్రవీణ్, అలుగోజు శివకృష్ణతో పాటు యూనియన్ సభ్యులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని వారు పేర్కొన్నారు.

దండేపల్లి ఆటో యూనియన్ డ్రైవర్లు ఐకమత్యంతో ముందుకు సాగుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటారని అధ్యక్షుడు మాచర్ల శంకర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు మాచర్ల శ్రీనివాస్, కట్కూరి సురేష్, రవీంద్ర చారి, గడ్డం రేవంత్, గడ్డం నాగేష్, ఎం.డి. జావిద్, అలుగోజు బాలకృష్ణ, కామేరా సుమన్, కుమార్ గడ్డ జానీ రౌత్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సీఐ కొండ్ర శ్రీనివాస్, ఎల్కతుర్తి ఎస్‌ఐ E. నరసింహారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దండేపల్లి ఆటో యూనియన్ సభ్యులను అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.