ప్రజా భవన్లో మంత్రులతో వొడితల ప్రణవ్ భేటీ
భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ హుజురాబాద్ అభివృద్ధి, దళిత బంధు, అంబేద్కర్ భవన్‌పై ప్రత్యేక చర్చ
హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రజా భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై మంత్రులతో ప్రణవ్ ప్రత్యేకంగా చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే దళిత బంధు పథకం అమలు, అంబేద్కర్ భవన్ నిర్మాణం తదితర కీలక అంశాలపై మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాలు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగేందుకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వ సహకారం, సంక్షేమ పథకాల అమలుపై చర్చించడం ద్వారా హుజురాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వొడితల ప్రణవ్ పేర్కొన్నారు.

