Thursday, October 22, 2026
Homeతెలంగాణఅమర పోలీసు షేక్ దాదేకు ఘన నివాళులు

అమర పోలీసు షేక్ దాదేకు ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి: 1996 సంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అమరుడైన దండేపల్లి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ దాదేకు కోదాటి సురేష్ రావు డీఎస్పీకి పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసు షేక్ దాదే త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ రక్షణలో, ప్రజల భద్రతలో పోలీసులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం సేవలందించిన అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.

ఈ సందర్భంగా అమర పోలీసులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అమరుల త్యాగం చిరస్మరణీయం.. వారి సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. 

పోలీసు అధికారులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నివాళులు

ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సీఐ కొండ్ర శ్రీను, ఎస్ఐ ఈ. నరసింహారావు పాల్గొని నివాళులర్పించారు. అలాగే కోదాటి సురేష్ రావు కుటుంబ సభ్యులు, సోదరులు, కుమారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్, సామాజికవేత్త కట్కూరి రాజేందర్, మాజీ సర్పంచ్ చదిరం వీరస్వామి, చిర్ర కొమురెల్లి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నాయినేని మదన్మోహన్ రావు, యువ నాయకులు జన్ను మహేష్, కడారి పవన్ కుమార్, గునిగంటి రమేష్, ఎండీ ఖదీర్, కట్కూరి శ్రీనివాస్, బోయినపల్లి దేవేందర్ రావుతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొని కోదాటి సురేష్ రావుకు ఘన నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.