అమర పోలీసు షేక్ దాదేకు ఘన నివాళులు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి: 1996 సంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అమరుడైన దండేపల్లి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ దాదేకు కోదాటి సురేష్ రావు డీఎస్పీకి పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసు షేక్ దాదే త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ రక్షణలో, ప్రజల భద్రతలో పోలీసులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని...