Monday, October 19, 2026
HomeEditorialరాష్ట్రాలు వేరైనా.. అభిమతం ఒక్కటే!

రాష్ట్రాలు వేరైనా.. అభిమతం ఒక్కటే!

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ  భారతదేశం బాగుండాలి.. గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరగాలి: దుర్గమ్మ తల్లికి ప్రార్థన

భారతదేశ అభివృద్ధి, రైతుల సంక్షేమం, జలవనరుల సద్వినియోగమే లక్ష్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరగాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రాలు వేరైనా ప్రజల ఆకాంక్షలు, దేశం పట్ల ఉన్న అభిమతం ఒక్కటేనని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని తెలిపారు. దేశ అభివృద్ధికి నీటి వనరుల సమర్థ వినియోగం ఎంతో ముఖ్యమని, గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరిగితే నీటి లభ్యత పెరిగి వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు.

దేశంలోని నదీజలాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా నీటి కొరతను తగ్గించడంతో పాటు రైతులకు సాగునీరు అందించేందుకు అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియ సాకారం కావాలని, భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రాల మధ్య సరిహద్దులు వేరైనా.. దేశం బాగుండాలనే సంకల్పం ఒక్కటే అనే సందేశంతో జాతీయ సమైక్యత, రైతుల సంక్షేమం, జలవనరుల అభివృద్ధిపై తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.