భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ తాగునీరు వృధా కాకుండా చూడాలి.మున్సిపాలిటీ పాలకవర్గాన్ని మిషన్ భగీరథ అధికారుల ను డిమాండ్ చేసిన బీసీ జేఏసీ నాయకులు.బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న.
హుజరాబాద్ పట్టణంలోగత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ త్రాగినీరు వృధా అవుతుందన్న విషయాన్ని తెలుసుకొని గురువారం రోజు హుజురాబాద్ పట్టణం లోని విజయ డయాగ్నస్టిక్ కేంద్రం, కేరళ స్కూల్ పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాలను బీసీ జేఏసీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షులు మామునూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, మాట్లాడుతూ,హుజురాబాద్ పట్టణంలో అనేక చోట్ల నీరు వృధాగా రోడ్ల పైనప్రవహిస్తూ ప్రజా అవసరాలకు ఉప యోగపడవలసిన తాగునీరు మురికి కాలువల పాలు కావడం తాము గురువారం రోజు గమనించడం జరిగిందని తెలియజేస్తూ, త్రాగునీటి వృధాపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినారు. ఈ త్రాగునీటి వృధా హుజురాబాద్ మున్సిపాలిటీ అదేవిధంగా మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యపు పనితీరుకు నిదర్శనం అని వారు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన సరి యైన వర్షాలు కురవక వర్షా భావ పరిస్థితిఏర్పడినందున భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నందున నీటి పొదుపు గురించి ప్రజలకు తెలియ జేస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ప్రజా అవసరా లకు ఉపయోగపడాల్సిన త్రాగునీరు తమ కళ్ళముందే వృధాగావడాన్ని చోద్యంగా చూస్తూ, నిమ్మకు నీరెత్తి నట్టుగా ఉండటం ఎంత వరకు సబబు అని ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో అవసరా నికి మించి త్రాగునీరు సరఫరా చేయడంమూలంగా మిగతా ప్రాంత ప్రజలకు తగిన విధంగా నీటి సరఫరా జరగకపోవడం వలన ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లు తాము గమనించామని ఈ సందర్భంగా తెలియ జేసినారు. హుజురాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ త్రాగునీరు వృధా కాకుండా హుజురాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ తమ ప్రాంతాలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజల సమస్యలతో పాటు త్రాగు నీటి వృధా సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి తమ సిబ్బందితోపైపుల లీకేజీ ద్వారా నీరు వృధా కాకుండా మరమ్మతులు చేయించాలని కోరినారు. అదేవిధంగా ప్రజల ఇండ్లకు త్రాగునీరు సరఫరా అవు తున్న పైపులకు క్యాప్ లను అమర్చుకోవాలని ప్రజలకు తెలియజేస్తూ, మున్సిపల్ సిబ్బంది తగిన పర్యవేక్షణ చేయునట్లు అధికారులు బాధ్యత తీసుకోవాలని గుర్తుచేసినారు. మున్సిపాలిటీ పాలకవర్గం అధికారులతో పాటు సంబంధిత మిషన్ భగీరథ అధికారులు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పట్టణము లో త్రాగునీరు వృధా అవుతున్న ప్రాంతాలను సందర్శించి తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

