Monday, October 19, 2026
Homeతెలంగాణషార్ట్ సర్క్యూట్‌తో జేసీబీ దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో జేసీబీ దగ్ధం

📰 Generate e-Paper Clip

కుటుంబ పోషణ కోసం ఇటీవలే సొంతంగా కొనుగోలు చేసిన వాహనం మంటల్లో కాలిపోయిన ఘటన

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లో గోపాల్‌పూర్: తన కష్టాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషించేందుకు డ్రైవర్‌గా పనిచేస్తూ, ఇటీవలే సొంతంగా జేసీబీ వాహనాన్ని కొనుగోలు చేసిన సూర హరికృష్ణ అలియాస్ రవి కుటుంబానికి తీవ్ర విషాదం ఎదురైంది. గోపాల్‌పూర్ గ్రామంలో సోమవారం జేసీబీ వాహనం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

కుటుంబ పోషణ కోసం హరికృష్ణ కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన సంపాదనతో పాటు ఫైనాన్స్ ద్వారా వాహనాన్ని తీసుకుని జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే తనకు సొంతంగా జేసీబీని కొనుగోలు చేశాడు. అయితే ఈరోజు వాహనాన్ని నడుపుతుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో అప్రమత్తమైన హరికృష్ణ వెంటనే వాహనం నుంచి దూకి బయటపడడంతో ప్రాణాపాయం తప్పింది.సుమారు సమయం 8:30. అయితే జేసీబీ మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. దీంతో హరికృష్ణకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.

హరికృష్ణకు భార్య అనూష, కుమార్తె తల్లి తల్లిదండ్రులు. సూర రవి సూర రజిత ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు ఎంతో కష్టపడి ఇటీవలే సొంతంగా వాహనం కొనుగోలు చేసిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదానికి సంబంధించిన వాహనం నెంబర్ TS 02 EQ 8962, మోడల్ నెంబర్ 770గా పేర్కొన్నారు. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.