Monday, October 19, 2026
Homeతెలంగాణరాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన హుజురాబాద్ ఏసీపీ మాధవి

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన హుజురాబాద్ ఏసీపీ మాధవి

📰 Generate e-Paper Clip

ఐదు పతకాలు సాధించి ప్రతిభ చాటిన ఏసీపీకి జమ్మికుంట పోలీసుల ఘన సన్మానం

బీమ్ ఇండియా టుడే, న్యూస్ హుజురాబాద్ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఐదు పతకాలు సాధించిన హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవిని జమ్మికుంట పోలీసులు ఘనంగా సన్మానించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఏసీపీ మాధవి టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పాల్గొని నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సాధించి ప్రతిభను చాటారు.

శాఖాపరమైన విధుల్లో నిరంతరం బిజీగా ఉంటూనే క్రీడలపై ఆసక్తిని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో ఐదు పతకాలు సాధించడం పట్ల జమ్మికుంట పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటిన ఏసీపీ మాధవిని అభినందించారు.

ఈ సందర్భంగా ఏసీపీ కార్యాలయంలో జమ్మికుంట పట్టణ సీఐ సుధా గోని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఏసీపీ మాధవికి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సాధించిన విజయాలు పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.