Tuesday, October 20, 2026
Homeతెలంగాణపేద విద్యార్థులకు అండగా డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా ట్రస్ట్

పేద విద్యార్థులకు అండగా డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా ట్రస్ట్

📰 Generate e-Paper Clip

తండ్రిని కోల్పోయిన విద్యార్థినికి రూ.6 వేల ఆర్థిక సహాయం

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లో పేద విద్యార్థులకు అండగా నిలిచి, వారి ఉన్నత విద్యకు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో 

 డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. ట్రస్ట్ సభ్యులు గడ్డం సంజీవ్ కుమార్, న్యాయవాది, గ్రామ సర్పంచ్ గొల్లిపెల్లి సంపత్, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ చిర్ర రాజయ్య, సామాజికవేత్త కట్కూరి రాజేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు గడ్డం సంజీవ్ కుమార్, న్యాయవాది మాట్లాడుతూ.. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా తండ్రిని కోల్పోయిన ఆడపిల్లల ఉన్నత చదువులకు ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దండేపల్లి గ్రామానికి చెందిన లేట్ గొట్టే కృష్ణమోహన్ కుమార్తె గొట్టే హరిప్రియకు ఉన్నత విద్య కోసం రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు దూరం కాకుండా చూడటమే ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని, విద్యార్థుల ఉన్నత చదువులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ట్రస్ట్ పూర్తి బాధ్యత తీసుకుంటుందని గడ్డం సంజీవ్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గొల్లిపెల్లి సంపత్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజల అభివృద్ధిలో ట్రస్టులు భాగస్వాములు కావాలని, ముఖ్యంగా పేద విద్యార్థులకు అండగా నిలవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. భవిష్యత్తులో ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు, విద్యార్థులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బుద్ధిస్ట్ కామెర లక్ష్మణ్, జన్ను మహేష్, గడ్డం దేవానందం, మాచర్ల మల్లయ్య, మారుపాక శంకర్ కట్కూరి శ్రీనివాస్ పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.