Monday, October 19, 2026
HomeEditorialఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు తూముల శ్రీకాంత్ కృతజ్ఞతలు

ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు తూముల శ్రీకాంత్ కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

1000K మైలురాయిని చేరుకున్న భీమ్ ఇండియా టుడ

హైదరాబాద్: భీమ్ ఇండియా టుడే న్యూస్ పేపర్ మరియు ఛానల్‌ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రేక్షకుల సహకారంతో 1000K మైలురాయిని చేరుకున్న సందర్భంగా భీమ్ ఇండియా టుడే నిర్వాహకులు, ప్రతినిధి తూముల శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భీమ్ ఇండియా టుడేను సబ్‌స్క్రైబ్ చేసి, ప్రతి వార్తను ఆదరిస్తూ, తమ అభిమానాన్ని చూపిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు తూముల శ్రీకాంత్ శిరస్సు వంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహమే భీమ్ ఇండియా టుడేను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాన బలమని పేర్కొన్నారు.

1000K మైలురాయిని చేరుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసి తనను అభినందించిన పెద్దలు, శ్రేయోభిలాషులు, అభిమానులు, మిత్రులకు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ప్రజల గొంతుకగా, వాస్తవాలను ప్రజలకు చేరవేసే నమ్మకమైన వార్తా వేదికగా భీమ్ ఇండియా టుడే మరింత ముందుకు సాగుతుందని తూముల శ్రీకాంత్ తెలిపారు.

భీమ్ ఇండియా టుడేకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి అభిమానం, ఆదరణ ఎప్పటికీ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.