Tuesday, October 20, 2026
Homeతెలంగాణతెలంగాణలో ఆటో చార్జీల పెంపు

తెలంగాణలో ఆటో చార్జీల పెంపు

📰 Generate e-Paper Clip

కనీస చార్జీ ₹30కి పెంపు.. కిలోమీటర్‌కు ₹14

భీమ్ ఇండియా టుడే న్యూస్  హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో ఆటో ప్రయాణికులకు కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఆటోల కనీస చార్జీని ప్రస్తుతమున్న ₹20 నుంచి ₹30కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతి కిలోమీటర్‌కు వసూలు చేసే చార్జీని ₹11 నుంచి ₹14కు పెంచారు.

కొత్త చార్జీల ప్రకారం డిటెన్షన్ చార్జీని 50 పైసల నుంచి 75 పైసలకు, లగేజీ చార్జీని 25 పైసల నుంచి 50 పైసలకు పెంచారు. అయితే ఒక్కో ప్రయాణికుడి లగేజీకి సంబంధించిన గరిష్ఠ పరిమితి 100 కిలోలుగా కొనసాగించనున్నారు.

అదేవిధంగా రాత్రి వేళల్లో ప్రయాణించే ఆటోలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 1.5 రెట్లు చార్జీ విధానం కొనసాగుతుంది. కొత్త చార్జీలకు అనుగుణంగా ఆటో మీటర్లను రీసెట్ చేసుకునేందుకు డ్రైవర్లకు మూడు నెలల గడువు విధించారు.

చార్జీల పెంపుతో ఆటో డ్రైవర్లకు నిర్వహణ వ్యయాలు, ఇంధన ధరలు తదితర భారాల నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉండగా, ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.