మైనార్టీ సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు, సోదరీమణులకు గ్యార్మీ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్, వైస్ చైర్మన్ జావీద్, కౌన్సిలర్ ఘఫర్, మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్, సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతిరెడ్డి, అజ్జాద్ ఖాన్ తదితరులతో పాటు మైనార్టీ సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు సోదరభావం, శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా కొనసాగాయి.

