Tuesday, October 20, 2026
Homeతెలంగాణకరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు

కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు

📰 Generate e-Paper Clip

ప్రజలకు తీవ్ర ఇబ్బందులు.. నలుదిక్కులా గేట్లు, పోలీసుల ఆంక్షలపై అసంతృప్తి

భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్: నూతన కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన సాధారణ ప్రజలకు మాత్రం అడుగడుగునా ఆంక్షలు ఎదురయ్యాయని స్థానికులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో నలుదిక్కులా గేట్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఆటంకాలు కలిగించారని పలువురు ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి భారీగా పోలీసు బలగాలను మోహరించినప్పటికీ, ప్రజలకు కార్యక్రమాన్ని చూసే అవకాశం కూడా లేకుండా ఆంక్షలు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది.

ప్రజా పాలన అని చెబుతున్న ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కార్యక్రమంలోనే సాధారణ ప్రజలను దూరంగా ఉంచడమేంటని పలువురు ప్రశ్నించారు. కనీసం కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన వారిని కూడా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదిలా ఉండగా, జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ ప్రజలతో దురుసుగా మాట్లాడుతున్నారని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని గెంటివేస్తున్నారని కొందరు ఆరోపించారు. పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజల భద్రత కోసం బందోబస్తు అవసరమే అయినప్పటికీ, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమానికి వచ్చిన సామాన్య ప్రజలకు కనీసం వీక్షించే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.