Tuesday, October 20, 2026
Homeతెలంగాణసన్రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

సన్రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సిద్ధి వినాయకుని ఆశీస్సులు దండేపల్లి ప్రజలపై ఉండాలి: యూత్ కమిటీ సభ్యులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 20: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలోని న్యూ ఎస్సీ కాలనీలో సన్రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు, గ్రామ ప్రజలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ఈ అన్నదాన కార్యక్రమంలో అనేకమంది గ్రామ ప్రజలు పాల్గొని భోజనాలు చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రజలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని యూత్ కమిటీ సభ్యులు తెలిపారు.

సిద్ధి వినాయకుని ఆశీస్సులు దండేపల్లి గ్రామ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని సన్రైజర్స్ యూత్ కమిటీ సభ్యులు సంతోషంగా వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.