Tuesday, October 20, 2026
Homeతెలంగాణతెలంగాణ అంబేద్కర్ సంఘం ఎల్కతుర్తి మండల అధ్యక్షుడిగా బొంకూరి రాజు

తెలంగాణ అంబేద్కర్ సంఘం ఎల్కతుర్తి మండల అధ్యక్షుడిగా బొంకూరి రాజు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి తెలంగాణ అంబేద్కర్ సంఘం ఎల్కతుర్తి మండల నూతన అధ్యక్షుడిగా ఇందిరానగర్ గ్రామానికి చెందిన బొంకూరి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాష్ట్ర అధ్యక్షులు వెల్మకంటి దయాకర్ ఆదేశాల మేరకు ఆదివారం ఎల్కతుర్తిలోని కాకతీయ వనవిహార్ పార్కులో తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గొర్రె థామస్ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన మండల కమిటీ మండల అధ్యక్షుడుగా బొంకూరి రాజు (ఇందిరానగర్) ఉపాధ్యక్షులు గొర్రె తిరుపతి (దామెర)అంబాల కిరణ్ (ఎల్కతుర్తి) ప్రధాన కార్యదర్శి బొల్లారపు శ్రీనివాస్ (పెంచికలపేట్)సహాయ కార్యదర్శులు చిలుముల ప్రమోద్ గొర్రె అజయ్ ఆరేపల్లి కిరణ్ సలహాదారులు ఎల్తూరి సురేష్ గౌరవ అధ్యక్షులుగా ఆరేపల్లి రాజయ్యను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గొర్రె థామస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పించాలని సమానత్వం సామాజిక న్యాయం రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.నూతన అధ్యక్షుడు బొంకూరి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు సంఘం సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మండలంలోని అన్ని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంబాల ఆర్య రాజ్ చిలుముల ప్రమోద్ శనిగరపు వంశీ మండల కమిటీ సభ్యులు అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.