జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు,కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు
భీమ్ ఇండియా టుడే న్యూస్,హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ మండల కేంద్రంలో బీసీల ఆరాధ్యదైవం చాకలి ఐలమ్మ 41వ, వర్ధంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా….
వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ…
భూస్వామ్య వ్యవస్థ కూకటి వేళ్లను పెకిలించి తరతరాల నిరంకుశ రాజుల బూజు దులిపిన రైతాంగ సాయుధ సంగ్రామానికి మొదలు ఓ సామాన్య స్త్రీ చేసిన ధైర్యమే. ”బాంచన్ నీ కాల్మొక్తా” అంటూ దొరలకు బానిసలుగా బిడ్డలు బతుకుతున్న రోజులవి. భూస్వాములు నాటి శ్రామిక జనం కష్టాన్ని పన్నుల రూపంలో దోచుకుంటూ అమానవీయంగా, రాక్షసంగా అణచివేత కొనసాగించారు. అలాంటి నేలలో ఓ సామాన్య స్త్రీ దొరలకు ఎదురు తిరిగింది. తనపై దాడి చేస్తే ప్రతిఘటించి,ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తనపై తప్పుడు కేసులు బనాయించిన దొరలకు సవాల్ విసిరి కోర్టులో కేసు గెలిచి చరిత్ర సృష్టించింది. ఆమె చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ తిరుగుబాటుకు స్ఫూర్తి ఐలమ్మ, బానిసత్వ సంకెళ్ల నుంచి శ్రామిక ప్రజలకు విముక్తి కలిగించిన వీరవనిత. దొరగడీలో గడ్డి మొలుస్తదని సవాలు విసిరి అచరణలో నిరూపించిన వీరనారి ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న, చనిపోయింది. ఆమె వారసత్వాన్ని నేటి యువతీ యువకులు స్వీకరించాలి.నేటి ఆధిపత్య కుల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం ఉద్యమించాలి. రైతాంగ సాయుధ పోరాట యోధురాలు తన ఉద్యమ నేపథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన జరిపిన దిశాలి చిట్యాల ఐలమ్మ మరువకండి మహానీయులను ఐలమ్మ ఆశయాలను సాదిధ్ధాం ఆమె ఆలోచనా విధానాన్ని కొనసాగించాలని రాజు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సిసిపల్లి గ్రామ సర్పంచ్ తిమ్మాపురం సంపత్,తంగళ్లపల్లి గ్రామస్తులు రాజశేఖర్, ఏస్ రమేష్, శంకర్,మహేష్, శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.

