Thursday, September 10, 2026
Homeతెలంగాణదామెర విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలి

దామెర విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

రైతులకు 3-ఫేజ్ కరెంట్, గ్రామానికి 33KV Alternate లైన్ ఏర్పాటు చేయాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తెలిపారు

దామెర గ్రామానికి ప్రస్తుతం ఉన్న 33KV విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ (Alternate) లైన్ లేకపోవడంతో, చిన్న సాంకేతిక సమస్య వచ్చినా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతోందన్నారు. దీనివల్ల తాగునీటి సరఫరా, విద్యార్థుల చదువులు, వ్యాపారాలు, రోజువారీ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు

ముఖ్యంగా రైతులకు 3-ఫేజ్ విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో పొలాలకు నీరు పెట్టుకోలేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు

ఈ సమస్యలపై విద్యుత్ శాఖ SE, ADE, AE అధికారులకు వినతి పత్రం అందజేసి, దామెర గ్రామానికి 33KV Alternate లైన్ ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు 3-ఫేజ్ విద్యుత్ సక్రమంగా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు

అధికారులు వెంటనే స్పందించి 33KV Alternate లైన్ కోసం సర్వే, అంచనాలు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని, అలాగే వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు*.

రైతుల పంటలు ఎండిపోయిన తర్వాత కాకుండా, ఇప్పుడే విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లెపాటి మాధవరావు, ప్రధాన కార్యదర్శులు చిరురాల వెంకటేష్, అల్లి కుమార్, కార్యదర్శి కోడం రమేష్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి సంపత్ రావు, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, జనానికిష్టయ్య, ఆడెపు శ్రీ వర్ధన్, సల్పాల కిరణ్. ఠాకూర్ శాంసింగ్.చీరాల రంజిత్, మాధవరావు.తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.