దామెర విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలి
రైతులకు 3-ఫేజ్ కరెంట్, గ్రామానికి 33KV Alternate లైన్ ఏర్పాటు చేయాలి భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తెలిపారు దామెర గ్రామానికి ప్రస్తుతం ఉన్న 33KV విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ (Alternate) లైన్ లేకపోవడంతో, చిన్న సాంకేతిక సమస్య వచ్చినా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతోందన్నారు. దీనివల్ల తాగునీటి సరఫరా, విద్యార్థుల చదువులు, వ్యాపారాలు, రోజువారీ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు...