Thursday, September 10, 2026
Homeతెలంగాణ(30) అంశములకు పాలకవర్గము వారు ఆమోదము తెలిపినారు.

(30) అంశములకు పాలకవర్గము వారు ఆమోదము తెలిపినారు.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్  రోజున హుజురాబాద్ పురపాలక సంఘం నందు పురపాలక చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రోంటాల గారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.

ఇట్టి సమావేశము నందు (30) అంశములను ప్రవేశపెట్టగా, మొత్తం (30) అంశములకు పాలకవర్గము వారు ఆమోదించినట్లు తెలిపినారు.

అందులో పురపాలక సంఘము పరిధిలో వినాయక నిమజ్జనము కొరకు సాధారణ నిధుల నుండి రూ. 9,75,000/-లు, సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగల నిర్వహణ కొరకు రూ. 27,50,000/-లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా, వర్షాకాలము దృష్ట్యా లీకేజీలు, రిపేర్లు, ఫ్లడ్ డ్యామేజీలను వెంటనే రిపేర్లు చేయుటకు అత్యవసర సిబ్బంది కొరకు ఎమర్జెన్సీ వాహనము ఏర్పాటుకు రూ. 5,00,000/-లు, పురపాలక సంఘము నందు విధులు పారిశుద్ధ్య (146) మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్సూరెన్స్ కొరకు రూ. 1,46,000/-లు, డెడ్ బాడీ ఫ్రీజర్ల రిపేర్లు మరియు నూతనంగా ఒక డెడ్ బాడీ ఫ్రీజర్ కొనుగోలు చేయడానికి రూ. 1,15,000/-లు వివిధ వార్డులలో ఏర్పడిన గుంతలలో మొరం పోయుటకు రూ. 1,00,000/-లు, వివిధ వార్డులలో చెడిపోయిన కల్వర్టుల నిర్మాణాలకు రూ. 2,00,000/-లు మరియు వివిధ వార్డులలో వీధి దీపములు లేని విద్యుత్ స్తంబములకు వీధి దీపాలు ఏర్పాటు చేయుటకు 15వ ఆర్ధిక నిధుల నుండి రూ. 10,00,000/-లు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదము తెలిపినారు.

ఇట్టి సమావేశము నందుపాలక చైర్ పర్సన్ శ్రీమతి సుహాసిని రొంటాల, వైస్-చైర్ పర్సన్ శ్రీమతి గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కమిషనర్ బి. కిషన్ , మేనేజర్ శ్రీ ఆర్. భూపాల్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ జి. అభినవ్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ డి. కిరణ్ టెక్నికల్ అధికారి శ్రీ నరేష్, జూనియర్ అకౌంట్స్ అధికారి శ్రీమతి ఎస్. ఆరతి , జూనియర్ అకౌంటెంట్ శ్రీ సి.హెచ్. గోపాల్ రెడ్డి, వ్యవస్థాపన క్లార్కు టి. భవర్ సింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎస్. శ్రీకాంత్ మరియు ఇతర కార్యాలయ సిబ్బంది ఉన్నారు. కావున ఇట్టి విషయమును పట్టణ ప్రజలకు తెలియజేయు నిమిత్తము మీ దినపత్రిక నందు ప్రచురణ చేయుటకు గాను తమరిని కోరినది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.