Saturday, September 19, 2026
Homeతెలంగాణవిద్యార్థుల ఫీజు బకాయిలపై బీజేపీ భగ్గుమంది!

విద్యార్థుల ఫీజు బకాయిలపై బీజేపీ భగ్గుమంది!

📰 Generate e-Paper Clip

గీతాభవన్ చౌరస్తాలో భారీ నిరసన – సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

భీమ్ ఇండియా టుడే న్యూస్  కరీంనగర్: విద్యార్థుల ఫీజు బకాయిల సమస్యపై భారతీయ జనతా పార్టీ ఆందోళన బాట పట్టింది. “విద్యార్థుల ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా బీజేపీ కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు సాయిని మల్లేశం పిలుపు మేరకు గీతాభవన్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

     సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ప్రభుత్వ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

 విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమని, బకాయిల చెల్లింపులో జాప్యం జరగడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరారు.

 ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం

విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు బీజేపీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.గీతాభవన్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.