Friday, August 28, 2026
HomeEditorialజర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వారికే ఇవ్వాలి.

జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వారికే ఇవ్వాలి.

📰 Generate e-Paper Clip

  •  భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాయిత రాములు, కామినేని రవీందర్ ఆధ్వర్యంలో.హుజురాబాద్ జర్నలిస్టుల ధర్నాలో బీసీ జేఏసీ నాయకుల డిమాండ్.?

బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న.

హుజురాబాద్ కేసీ క్యాంపు లో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తమకే ఇవ్వాలని జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాయిత రాములు, కామినేని రవీందర్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, కొల్లిపాక క్రాంతి కుమార్ మాట్లాడుతూ, గత బిఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో హుజురాబాద్ జర్నలిస్టులకు కేసి క్యాంపు కార్యాలయం లోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా కాంగ్రెస్ నాయకులు గూడూరు స్వామి రెడ్డి దీనికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయడం పట్ల ఆవేదనవ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అభిప్రాయ పడినారు. ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని అతని చేత సంబంధిత కేసు ఉప సంహరింపజేసిజర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వారికే క్రమబద్ధీకరణ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇట్టి భూముల క్రమబద్ధీకరణకు జర్నలిస్టుల నిర్వహించే ఉద్యమ కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధు లు, అధికారులు తక్షణమే స్పందించి జర్నలిస్టులకు వారికి కేటాయించిన భూములను వారికే క్రమ బద్ధీకరణ చేసి తగు న్యాయం చేయాలని పిలుపు నిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.