Friday, August 28, 2026
HomeEditorialఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణకు అభిమానుల సందడి

ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణకు అభిమానుల సందడి

📰 Generate e-Paper Clip

ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణకు అభిమానుల సందడి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానాన్ని ప్రతిబింబించే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సోమన్న అభిమానులు, కళాకారులు, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సామాజిక సమస్యలు, అణగారిన వర్గాల హక్కులు, సమానత్వం, రాజ్యాంగ విలువలను తన పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఏపూరి సోమన్న 25 ఏళ్ల కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. కార్యక్రమానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. ఆయన రాక కోసం అభిమానులు, కళాకారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, కులం, వర్గం, సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు లభించాలనే సందేశాన్ని సోమన్న తన పాటలు, కళా ప్రదర్శనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అభిమానులు పేర్కొన్నారు. ముఖ్యంగా దళితులు, బహుజనులు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం, సమానత్వం అందాలనే ఆకాంక్షను ఆయన పాటలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.

సోమన్న పాటల ప్రభావం గత 25 ఏళ్లుగా ప్రజల్లో కొనసాగుతోందని, ఆయన పాటలు సామాజిక చైతన్యానికి దోహదపడుతున్నాయని పలువురు కళాకారులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి వంటి ప్రజాప్రతినిధులు కూడా అన్ని వర్గాల సంక్షేమం, సమానత్వం కోసం ముందుకు రావాలని అభిమానులు ఆకాంక్షించారు.

సూర్యాపేట, హబ్సిగూడ, జనగామ, కోదాడ, యాదాద్రి తదితర ప్రాంతాల నుంచి రవీంద్రభారతికి అభిమానులు, కళాకారులు చేరుకున్నారు సింగారం  రవీందర్, రాములు, శీను, హబ్సిగూడ  మున్న, మహాజన సురేష్, వి. వెంకటేష్, పి. వెంకటేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణతో పాటు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానాన్ని స్మరించుకుంటూ కళా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.