Thursday, August 27, 2026
Homeఆంధ్ర ప్రదేశ్శాస్త్రవేత్త డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు గారి సేవలు చిరస్మరణీయం

శాస్త్రవేత్త డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు గారి సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ కర్నూల్  09-08-2026 డోన్ శిల్ప హాస్పిటల్ నందు ప్రజలకు*పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై, కాలుష్యం, ఆరోగ్యం, పలు ఆంశాల పై ప్రజలకు అవగాహణ సదస్సు

శాస్త్రవేత్త డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు గారి సేవలు చిరస్మరణీయం

భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి**ప్రజలు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి, ప్లాస్టిక్ ని వాడకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి

మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి.మాధవ కృష్ణ ,డాక్టర్ బి. రమ్యశిల్ప

ఆగష్టు 9 న ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త శ్రీ యల్లా ప్రగడ సుబ్బారావు గారి వర్థంతి సందర్బంగా

డోన్ పట్టణంలోని శిల్ప హాస్పిటల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలోమెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి.మాధవ కృష్ణ, డాక్టర్ బి. రమ్యశిల్ప అద్యక్షతన శాస్త్రవేత్త శ్రీ యల్లాప్రగడ సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి. మాధవ కృష్ణ ,డాక్టర్ బి. రమ్య శిల్ప, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ*

మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి. మాధవ కృష్ణ, డాక్టర్ బి. రమ్య శిల్ప సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు

శ్రీ యల్లాప్రగడ సుబ్బారావు జనవరి 12, 1895 జన్మించారు. మన భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన మహానుభావులు. క్షయ, బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులను పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.శ్రీ యల్లాప్రగడ సుబ్బారావు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొందిన తర్వాత, ఈయన లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు. 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ను కనుగొన్నారు.కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితం చేశాడు. ప్రజల ఆరోగ్యాల పై నిరంతరం సేవలందించిన మహనీయులు డాక్టర్ యల్లాప్రగడ గారు 1948 ఆగష్టు 9వ తేదిన కన్నుమూశారు.లెడర్లీ సంస్థ వారు ఈయన పట్ల గౌరవ సూచకంగా బొంబాయిలోని బల్సార్‌లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు.ఇలాంటి మహానుభావులను స్మరించుకుంటు వారి అడుగుజాడలల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి. మాధవ కృష్ణ ,డాక్టర్ బి.రమ్య శిల్ప కోరారు.*భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి*పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై శిల్ప వైద్యశాలలో ప్రజలకు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి. మాధవ కృష్ణ ,డాక్టర్ బి. రమ్య శిల్ప కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి అవగాహణ కల్పించారు. వారు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మన దేశం లో గణాంకాలు పరిశీలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతున్నది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు వల్ల దంపతులు మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావించడం వల్ల ఆడపిల్లల భ్రూణ హత్యలు జరుగుతున్నా కారణంగా ఇలాంటి హత్యలను నిలువరించేందుకు ప్రభుత్వం 1994లో పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పై పూర్తిస్థాయిలో అవగాహనతో అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై సమాచారం అందించడానికి సమాజంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఈ చట్ట అమలుకు సహకరించాలని మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి. మాధవ కృష్ణ. డాక్టర్ బి. రమ్య శిల్ప, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. ఆడ మగ ఇద్దరూ సమానమేనని, లింగ వివక్ష చూపడం నేరమేనని అన్నారు. ఆడబిడ్డలను పుట్ట నిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం అని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి. మాధవ కృష్ణ ,డాక్టర్ బి. రమ్య శిల్ప కోరారు.అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి. మాధవ కృష్ణ ,డాక్టర్ బి. రమ్య శిల్ప ప్రజలకు ఆరోగ్యం,కాలుష్యం పై అవగాహణ కలిగించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ – ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులను సంప్రదించకుండా నొప్పులు మాత్రలు వాడరాదు.చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి. మాధవ కృష్ణ. డాక్టర్ బి. రమ్య శిల్ప ,సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.

పి.మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.