Friday, August 28, 2026
Homeతెలంగాణబీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో

బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో

📰 Generate e-Paper Clip

బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహణ
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి ఉత్సవాన్ని హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలి దశ ఉద్యమానికి పునాదిగా నిలచి మలిదశ ఉద్యమానికి నాంది పలికిన ఒక సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ సేవలు తెలంగాణ ప్రజల గుండెలో అజరామరంగా నిలుస్తాయని పేర్కొంటూ వారి సేవలు అనిర్వచనీయమని కొనియాడినారు అతని ఉద్యమ సిద్ధాంతమైనా నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమానికి మూల బిందువుగా నిలచి తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించడానికి తోడ్పడిందన్నారు అతని సిద్ధాంతానికి ఆకర్షితులై ఎందరో మహానుభావులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ఎంతో మంది యువకులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కొరకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం జరిగిందన్నారు ఎంతోమంది యువకుల త్యాగాల పునాదుల మీద ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని అతని ఆశయాలకు అనుకూలంగా నీళ్లు నిధులు నియామకాలకు తగు ప్రాధాన్యత నిచ్చి పరిపాలించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పూలే కమిటీ అధ్యక్షుడు చెల్లూరి రఘు చారి బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్ ఇప్పకాయల సాగర్ జాతీయ బీసీ సంక్షేమ హుజురాబాద్ నియోజకవర్గం మహిళా జనరల్ సెక్రెటరీ దేవ సాని ప్రియదర్శిని కొలిపాక క్రాంతి కుమార్ సొల్లు శంకర్ తిప్పారపు భువనచంద్ర ఎస్ సృజన కాలేశ్వరం సాల్మన్ పోతారపు అశోక్ పోగు సమ్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.