పీజీ కళాశాలలో ఘనంగా జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
భీమ్ ఇండియా టుడే హుజురాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త , మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఖమ్మం లో యూనివర్సిటీ పీజీ కళాశాలలో డాక్టర్. తడికమళ్ళ శేఖర్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. టి. గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పునాదులు వేసిన సిద్ధాంతకర్త, రచయిత డాక్టర్ జయశంకర్ సేవలను విద్యార్థులకు వివరించారు. ఆనాటి ముల్కీ ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు జయశంకర్ అపారమైన కృషిచేసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గణంకాలతో సహా వివరించి ఆనాటి పాలకులను ప్రశ్నించారు. ఉద్యమానికి కావలసిన సమాచారాన్ని, ప్రోత్సాహాన్ని అందించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అపారమైన కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆమెడ వీరన్న ,డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ గిరి ప్రసాద్, డాక్టర్ రవి బాబు, రాజీవ్ రాజ్, డాక్టర్ జగ్జీవన్ రావు, అద్దంకి తిలక్, రమ, రాణి, లక్ష్మీ హరిత, లైబ్రరీ అసిస్టెంట్ వెంకట నర్సయ్య, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అమర్నాథ్, పర్చా వెంకట్, కృష్ణారావు , బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెంకట రమణ, నరేందర్, వీరబాబు, మరియు విద్యార్థినీ ,విద్యార్థులు పాల్గొన్నారు.

