Friday, August 28, 2026
HomeEditorialఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు మాతృమూర్తి మృతికి బండి సంజయ్ నివాళి

ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు మాతృమూర్తి మృతికి బండి సంజయ్ నివాళి

📰 Generate e-Paper Clip

ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు మాతృమూర్తి మృతికి బండి సంజయ్ నివాళిభీమ్ ఇండియా టుడే న్యూస్ :- హుజూరాబాద్. పట్టణానికి చెందిన ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కుడికాల సురేష్ బాబు గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వారి నివాసానికి వెళ్లి, అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుడికాల సురేష్ బాబు గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తూ, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, హుజూరాబాద్ పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దివంగత ఆత్మకు ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.