Friday, August 28, 2026
HomeEditorialఆరోగ్యమే మహాభాగ్యం.. యువతకు ఆదర్శంగా సోల్ ఫిట్నెస్ జిమ్

ఆరోగ్యమే మహాభాగ్యం.. యువతకు ఆదర్శంగా సోల్ ఫిట్నెస్ జిమ్

📰 Generate e-Paper Clip

హుజూరాబాద్ | తెలంగాణ

ఆరోగ్యమే మహాభాగ్యం.. యువతకు ఆదర్శంగా సోల్ ఫిట్నెస్ జిమ్

హుజూరాబాద్ పట్టణంలోని సోల్ జిమ్ సెంటర్‌లో నేడు యువకులు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ, “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఫిట్‌నెస్ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

భీమ్ ఇండియా టుడే ప్రతినిధి, హుజూరాబాద్.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.