Friday, August 28, 2026
HomeEditorialఅమర్యాదగా "సోనం వాంగ్చుక్" దీక్ష భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

అమర్యాదగా “సోనం వాంగ్చుక్” దీక్ష భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

📰 Generate e-Paper Clip

బీమ్ ఇండియా టుడే. న్యూస్ వరంగల్, హనుమకొండ

అమర్యాదగా “సోనం వాంగ్చుక్” దీక్ష భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

కాక్రోచ్ పార్టీ 20- న తలపెట్టిన జంతర్ మంతర్ నుండి పార్లమెంటు వరకు చేస్తున్న మార్చ్ కు “తెలంగాణ ప్రజాఫ్రంట్ ” సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం!!.

మిత్రులారా!

గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ గారు చేస్తున్న నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేయడాన్ని తెలంగాణ ప్రజాఫ్రంట్ ఖండిస్తున్నది.

నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం,ప్రభుత్వం చర్చలకు యువతను ఆహ్వానించకపోవడం అంటే మరో మేధావి మరణానికి కేంద్ర ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుందని రాచమోని నాగభూషణం స్పష్టం చేశారు.

ప్రతిష్టాత్మకమైన మెగాసేసే అవార్డు గ్రహీత,గొప్ప విద్యావేత్త,మేధావి, పర్యావరణ ఉద్యమకారుడిని రక్షించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత దేశ పౌరులుగా మనందరి మీద ఉందని భావిస్తున్నాం.

కేంద్రపాలక బిజెపి ప్రభుత్వం,ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరూ కూడా నిరాహార దీక్షకు మద్దతు తెలియజేయకపోవడం చూస్తుంటే అహంకారపూరితం చెవిటి, కళ్ళు లేని కబోధ పార్టీలనా ప్రజలు ఎన్నుకునేది?

కేంద్ర ప్రభుత్వ నిరకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పిన రాజకీయ పార్టీలు మౌనం దాల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

దేశానికి చెందిన గొప్ప మేధావి,ఉద్యమకారున్ని కాపాడుకోవాలి.

ప్రజాస్వామిక వాదులు ఐక్యంగా సోనం వాంగ్చిక్కు మద్దతుగా,సిజెపి పార్టీ రేపు తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయాలని మద్దతు ప్రకటిస్తున్నాము.

నిన్నటి వరకు అన్నదాతల్ని విచ్ఛిన్నకారులు అన్నారు ఇప్పుడు దేశ విద్యార్థి యువతరాన్ని దేశద్రోహులు అంటున్నారు.

రామాలయంలో దొంగలు ఎవరో అడగద్దు ఇథనాల్ మతల బెంటో ఆరా తీయొద్దు భవిష్యత్తుకు భద్రతేదని నిలదీయొద్దనె వైఖరి కేంద్ర ప్రభుత్వానిది.

నరహంతక పాలనలో ప్రజలు తమ హక్కుల్ని పోరాటం ద్వారానే సాధించుకోవాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ పిలుపునిస్తోంది.

*ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమాభినందనలతో…*

జనగాం.కుమారస్వామి అధ్యక్షులు,    ప్రవీణ్ కుమార్.G ప్రధాన కార్యదర్శి,

తెలంగాణప్రజాఫ్రంట్

(TPF) వరంగల్ హనుమకొండ జిల్లా కమిటీ కమిటి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.