Thursday, November 12, 2026
HomeEditorialబోడుప్పల్ సర్కిల్ పరిధిలో రూ.1.25 కోట్లతో సీసీ రోడ్లు

బోడుప్పల్ సర్కిల్ పరిధిలో రూ.1.25 కోట్లతో సీసీ రోడ్లు

📰 Generate e-Paper Clip

అభివృద్ధి పనులు ప్రారంభం మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం

భీమ్ ఇండియా టుడే న్యూస్ మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, చెంగిచెర్ల డివిజన్‌లో గల సుభోదయ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ, శ్రీలక్ష్మీనగర్, వివేక్ నగర్, లెక్చరర్స్ కాలనీలలో మొత్తం రూ.1 కోటి 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనులను బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ, కాలనీలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ డివిజన్ అధ్యక్షులు పొగుల నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రావంతి కిషోర్ గౌడ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షులు పొగుల దిలీప్ రెడ్డి, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షులు బొమ్మక్ కళ్యాణ్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.