Monday, November 9, 2026
HomeEditorialకేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష.. 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర!

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష.. 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర!

📰 Generate e-Paper Clip

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష.. సాగునీటి కోసం 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర!

గోదావరిఖని యువకుల వినూత్న నిరసన.. ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కలిసి రైతుల సమస్యల వివరణ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో వ్యవసాయ రంగం తిరిగి పూర్వవైభవం సంతరించుకోవాలంటే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో గోదావరిఖనికి చెందిన పది మంది యువకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాగునీరు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సైకిల్ యాత్ర చేపట్టారు.

మాజీ కార్పొరేటర్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో ఈ యాత్ర మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు కొనసాగింది. ఎనిమిది రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి యువకులు తమ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.

అనంతరం ఎర్రవెల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యువకుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలను ఆయనకు వివరించారు. రైతుల పరిస్థితికి అద్దం పట్టేలా ఎండిపోయిన వరి కంకులను కేసీఆర్‌కు చూపించారు. అలాగే గోదావరి జలాలను ఆయనకు అందజేశారు.

యువకులు చేపట్టిన ఈ సైకిల్ యాత్రను కేసీఆర్ అభినందించారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ ముందుకొచ్చిన యువకులకు శుభాకాంక్షలు తెలిపారు.

సాగునీటి ప్రాధాన్యతను చాటిచెప్పడంతో పాటు రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఈ 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర గోదావరిఖని ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.