Tuesday, November 10, 2026
HomeEditorialకొప్పూర్‌లో ఘనంగా హనుమాన్ క్రాకర్స్ షాప్ ప్రారంభోత్సవం

కొప్పూర్‌లో ఘనంగా హనుమాన్ క్రాకర్స్ షాప్ ప్రారంభోత్సవం

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండలం లో కొప్పూర్ (గడ్డలబండ) గ్రామంలో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ క్రాకర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాంధీనగర్ (మాణిక్యపూర్) సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి, కొప్పూర్ సర్పంచ్ గడ్డ కుమారస్వామి, జగన్నాథపూర్ సర్పంచ్ పంజాల యాదగిరి గౌడ్ హాజరై షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేతిరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.కేతిరి లక్ష్మారెడ్డి గాంధీనగర్ సర్పంచ్ (మాణిక్యపూర్)సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.