Tuesday, November 10, 2026
Homeతెలంగాణహుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.వొడితల ప్రణవ్..

హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.వొడితల ప్రణవ్..

📰 Generate e-Paper Clip

ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పని చేస్తున్నాం..కోటి యాభై లక్షలతో నిర్మించబోయే 4ప్రధాన కూడళ్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రణవ్…

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్..

హుజురాబాద్ పట్టణ ప్రజలు తమపై పెట్టిన నమ్మకానికి తగ్గట్టుగా పని చేస్తున్నామని,హుజురాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని,15 కోట్లు రూపాయలను అభివృద్ధికి మంజూరు చేపించామని దాంట్లో భాగంగా హుజురాబాద్ ప్రధాన చౌరస్తాలో పట్టణ సుందరీకరణలో భాగంగా 4 చౌరస్తాల అభివృద్ధికి నేడు శ్రీకారం చుట్టారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్..శుక్రవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో గల చౌరస్తా అభివృద్ధికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో కోటి యాభై లక్షల రూపాయలతో నాలుగు ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామని,4.5 కోట్లతో సీసీ రోడ్లు,2.5 కోట్లతో డ్రైనేజ్ పనులకు,చిన్నపిల్లలు ఆహ్లాదంగా ఉండడానికి చిల్డ్రన్ పార్క్ తో పాటు ఇతర అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.గ్రామాల్లో ఐ మాక్స్ లైట్స్,58 లక్షలతో గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బందికి కలగకుండా బోర్లను మంజూరు చేపించామని తెలిపారు.హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇతర నాయకుల్లాగా మాటలు చెప్పమని,ఏదైతే చెప్తామో దాన్ని చేసి చూపిస్తామని అన్నారు..

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజలకు వరంగా మారిందని,ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని,పీసీసీ ఆదేశాల మేరకు మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జిగా హుజురాబాద్ మండల పరిధిలోని ధర్మరాజుపల్లిలో దీపావళి పండుగ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో జరుపుకోనున్నట్లు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 వేల ఇళ్లు మంజూరు కాగా 2,21,500 ఇళ్లు పూర్తి అయ్యాయని,నియోజకవర్గ వ్యాప్తంగా 5500 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 2500 పై చిలుకు ఇళ్లు పూర్తి అయ్యాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వాన్ని,ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,వైస్ చైర్మన్ అంజలి,కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,పట్టణ అధ్యక్షుడు,జిల్లా అధికార ప్రతినిధులు,యూత్,సేవాదళ్,మైనారిటీ,మహిళ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.