Tuesday, November 10, 2026
Homeతెలంగాణ24 వేల విలువైన పశువుల నీటి తొట్టి ఉచితంగా నిర్మాణం!

24 వేల విలువైన పశువుల నీటి తొట్టి ఉచితంగా నిర్మాణం!

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ 
VBGRAM G పథకం ద్వారా రైతులకు ప్రయోజనం.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచన
రైతు సోదరులకు ప్రభుత్వం శుభవార్త అందిస్తోంది. VBGRAM G పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న రైతులకు రూ.24,000 విలువైన పశువుల నీటి తొట్టిని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ పథకం ద్వారా పశువులకు తాగునీటి సదుపాయం కల్పించేందుకు వీలుంటుంది. పశువులు తిరిగే ప్రాంతంలోనే నీటి తొట్టిని నిర్మించనుండటంతో రైతులకు, పశుపోషకులకు ప్రయోజనం చేకూరనుంది. నీటి తొట్టి నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, రైతులు ఎలాంటి ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
దరఖాస్తు చేసుకోని రైతులు వెంటనే సంప్రదించండి
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని రైతులు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి, పథకానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
పథకానికి సంబంధించిన నిబంధనలు, అర్హతలు, దరఖాస్తుల స్వీకరణ వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద నిర్ధారించుకోవాలి.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.