Sunday, October 25, 2026
Homeతెలంగాణజూలై వరకు ఎల్ నినో ఎఫెక్ట్..ప్రతి ఒక్కరు20 శాతం

జూలై వరకు ఎల్ నినో ఎఫెక్ట్..ప్రతి ఒక్కరు20 శాతం

📰 Generate e-Paper Clip

జూలై వరకు ఎల్ నినో ఎఫెక్ట్..ప్రతి ఒక్కరు20 శాతం నీటి వాడకం తగ్గించాలి..లేదంటే తాగునీటికి కష్టం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో కరువు పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి విపత్తులను మనం కోరుకోకపోతే ఆగవని, అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయటపడవచ్చని అన్నారు.కరువును|

ఎదుర్కోవడంలో ప్రజలను భాగస్వాములను చేయడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నీటి వినియోగాన్ని 20 శాతంతగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.

జూలై వరకు ఎల్ నినో ప్రభావం

కరువు పరిస్థితులపై గత ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచంలోని సుమారు వంద దేశాల్లో ఎల్ నినో ప్రభావం ఉందని, ఒక్కో ప్రాంతంలో దాని ప్రభావం ఒక్కోలా ఉంటుందని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు ప్రారంభమైనప్పుడు వాటి తీవ్రత తక్కువగానే కనిపించినా, కాలక్రమంలో పరిస్థితులు తీవ్రం కావచ్చని వివరించారు.ఎల్ నినో ప్రభావం జూలై వరకు ఉంటుందని పేర్కొన్న సీఎం, నీటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చని హెచ్చరించారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ తాగునీటి కొరత సమస్య ఉందని ప్రస్తావించారు.

కరువును ఎదుర్కోవడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం

కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని అన్నారు. నీటిని పొదుపుగా వినియోగించడం, అందుబాటులో ఉన్న వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు.కరువును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో దీనికి కాంగ్రెస్ పార్టీ ఎలా కారణమవుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ పై విమర్శలు.. హరీశ్ రావుకు కౌంటర్

కరోనా సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కరోనా తీవ్రతను తక్కువగా అంచనా వేసేలా అప్పట్లో మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ మాటలను నమ్మడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.హరీశ్ రావు వ్యాఖ్యలను నమ్మితే ప్రజలకు కరోనా తరహా పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని సీఎం విమర్శించారు. ఆయన మాటలు వింటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన చర్యలను అనుసరించామని తెలిపారు.

రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అక్టోబర్ నెలలో ఇంతటి విద్యుత్ డిమాండ్ ఎప్పుడూలేదన్నారు.ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపడం సులభమేనని, సంక్షోభ సమయంలోనే పాలనలో

సవాళ్లు ఎదురవుతాయని వ్యాఖ్యానించారు.

విమర్శల కంటే సంక్షోభాన్ని

ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలి కరువు వంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే ప్రజలకు అండగా నిలవడం ముఖ్యమని సీఎం అన్నారు. మానవత్వంతో ముందుకు సాగుతూ ప్రజల సహకారంతో కరువు ప్రభావాన్ని ఎదుర్కోవాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.ప్రజలు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని, రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.