Sunday, October 25, 2026
Homeతెలంగాణపోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ

పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ

📰 Generate e-Paper Clip

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్‌లో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ.. యువత, విద్యార్థులు పాల్గొనాలని పోలీసుల పిలుపు

హుజూరాబాద్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమంలో యువతీ యువకులు, విద్యార్థులు, సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్నవారు, ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పోలీసులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సోమవారం ఉదయం 6:30 గంటలకు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకునే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.