భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా విజయదశమి పూజలు
హుజురాబాద్: మండలంలోని సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుధ పూజ, వాహన పూజ, శమీ పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కళాశాలలోని వివిధ ప్రయోగశాలల్లో ఉపయోగించే యంత్రాలు, పరికరాలకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా కళాశాల అవసరాల కోసం వినియోగించే వాహనాలకు వాహన పూజ నిర్వహించారు. అనంతరం శమీ పూజ కార్యక్రమాన్ని చేపట్టారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కళాశాల యాజమాన్యం, సిబ్బంది ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నింపింది.
ఈ పూజా కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. ఇంద్రనీల్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆఫీస్ సూపరింటెండెంట్ పెంచాలని శ్రీనివాస్ సమన్వయకర్తగా వ్యవహరించారు. కళాశాల సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

