బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని మనోజ్ రావు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: పట్టణంలోని బోర్నపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పరిశీలించారు. పండుగను పురస్కరించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడటంపై దృష్టి సారించారు. ప్రజలు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పుణ్య బాబు, మొగిలి, సునీత బాబు, మున్సిపల్ సిబ్బంది, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

