Monday, October 19, 2026
Homeతెలంగాణఅనారోగ్యంతో మృతి చెందిన హుజురాబాద్ మున్సిపాలిటీ కార్మికుడు

అనారోగ్యంతో మృతి చెందిన హుజురాబాద్ మున్సిపాలిటీ కార్మికుడు

📰 Generate e-Paper Clip

మున్సిపల్ కార్మికుడు ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హుజురాబాద్ మున్సిపాలిటీ కార్మికుడు కీ.శే. పరికిల్లా ప్రశాంత్ కుటుంబాన్ని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పరామర్శించారు. ప్రశాంత్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆమె, ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా మృతి చెందిన ప్రశాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మున్సిపాలిటీలో కార్మికుల సేవలు ఎంతో కీలకమని, పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో వారు నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా పట్టణ ప్రజలకు సేవలందించే కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యత అని ఈ సందర్భంగా తెలిపారు.

మున్సిపల్ కార్మికుడిగా పనిచేసిన ప్రశాంత్ మరణం పట్ల మున్సిపల్ సిబ్బంది కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, జవాన్లు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.