Monday, October 19, 2026
Homeతెలంగాణరాంపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగకు ముమ్మర ఏర్పాట్లు

రాంపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగకు ముమ్మర ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

పారిశుద్ధ్య పనులు, చెట్ల తొలగింపు, లైటింగ్ ఏర్పాట్లు ప్రారంభం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ రాంపూర్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో పండుగ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారి ఆదేశాలతో పాటు, కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారి వి. జగదీశ్వర్, హుజురాబాద్ మండల పంచాయతీ అధికారి టి. సునీత, రాంపూర్ గ్రామపంచాయతీ అధికారి ఎస్. మహేందర్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామంలోని పలు బతుకమ్మ ఘాట్ల వద్ద అవసరమైన పనులు ప్రారంభించారు.

బతుకమ్మ పండుగకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ ఘాట్ల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. అలాగే పిచ్చి చెట్ల తొలగింపు, పరిసరాల పరిశుభ్రతతో పాటు రాత్రివేళల్లో ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

పండుగను ప్రశాంతంగా, ఘనంగా నిర్వహించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముషం సంగీత, ఉపసర్పంచ్ వన్నాల శివాజీ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.