పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ పేద కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా
భీమ్ ఇండియా టుడే న్యూస్ పరకాల: పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని దామెర, ఆత్మకూరు, నడికూడ, గీసుకొండ, పరకాల మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

