Monday, October 19, 2026
Homeతెలంగాణభీమ్ ఇండియా టుడేకు 1000 మంది సబ్‌స్క్రైబర్లు

భీమ్ ఇండియా టుడేకు 1000 మంది సబ్‌స్క్రైబర్లు

📰 Generate e-Paper Clip

తక్కువ కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలు పొందడం అభినందనీయం

వ్యవస్థాపకుడు తూముల శ్రీకాంత్‌కు బీసీ జేఏసీ, ప్రజాసంఘాల అఖిలపక్ష నాయకుల ఘన సన్మానం

హుజురాబాద్: భీమ్ ఇండియా టుడే డిజిటల్ మీడియా ఛానల్‌ వెయ్యి మంది సబ్‌స్క్రైబర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ కూడలిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛానల్ వ్యవస్థాపకుడు తూముల శ్రీకాంత్‌ను బీసీ జేఏసీ, ప్రజాసంఘాల అఖిలపక్ష నాయకులు మైసా రామ్ చందర్ గుడికందుల వీర బ్రహ్మచారి తూముల రాజు తిప్పారపు సాగర్    శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సొల్లు బాబు మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలోనే భీమ్ ఇండియా టుడే ఛానల్ ప్రజల ఆదరాభిమానాలను చూరగొని వెయ్యి మంది సబ్‌స్క్రైబర్లను సాధించడం ఛానల్‌ పనితీరుకు నిదర్శనమని అన్నారు.

మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాల్సిన బాధ్యత ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు స్పందించేలా చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజల గొంతుకగా భీమ్ ఇండియా టుడే మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించి, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే వేదికగా నిలవాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని అభిలషించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు వన్నాల శివాజీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సొల్లు బాబు, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, సీనియర్ నాయకుడు ఆలేటి రవీందర్, ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతికుమార్, మీడియా మిత్రుడు బ్రహ్మం, బహుజన నాయకులు ములుగురి ప్రభాకర్, రామ్ సారయ్య, ములుగురు కొమురయ్య, దాట్ల ప్రభాకర్, బొడ్డు సంజీవ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.