VB-G RAM G ప్రత్యేక గ్రామ సభకు సర్పంచ్ అధ్యక్షత
భీమ్ ఇండియా టుడే న్యూస్, గాంధీనగర్, భీమదేవరపల్లి మండలం, హనుమకొండ జిల్లా.గాంధీనగర్ గ్రామ సర్పంచ్ శ్రీ కేతిరి లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన* గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మరియు VB-G RAM G ప్రత్యేక గ్రామ సభ ఘనంగా నిర్వహించారు.
ముందుగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా *DRDO PD శ్రీ మేనా శ్రీనివాస్ గారు* హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీ కేతిరి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ…* గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, అధికారులు సూచించిన విధంగా గ్రామ నక్షా ద్వారా ప్రజల అవసరాలకు అనుగుణంగా VGPP ప్లాన్ తయారు చేసి, ప్రతి పనిని పారదర్శకంగా చేపడతామని హామీ ఇచ్చారు.
తదనంతరం PD గారు మాట్లాడుతూ…* VGPP తయారీ మరియు ముఖ్యంగా *జల్ సిరి వర్క్స్* గురించి డెప్త్ గా వివరించారు. చెరువుల పూడికతీత, ఫీడర్ ఛానల్స్ పునరుద్ధరణ, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ వంటి నీటి సంరక్షణ పనులను పెద్ద ఎత్తున చేపట్టి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు.
MPDO శ్రీ వీరేశం గారు మాట్లాడుతూ…* MGNREGS ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పనులకు హాజరై 125 రోజుల ఉపాధిని పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
DTC శ్రీ కర్ర శ్రీధర్ రావు గారు (JA/JES), APO శ్రీ కుమారస్వామి గారు, *ఉప సర్పంచ్ శ్రీ బుర్ర సమ్మయ్య గారు,* వార్డు సభ్యులు – తూముల ఎల్లయ్య, పారందుల క్రాంతి, *బండి లక్ష్మణ్, చిదురాల పద్మ, వడ్డేపల్లి మమత, సందెల శ్వేత, తాళ్లపల్లి సరిత గార్లు, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, VOAs, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

