Tuesday, October 20, 2026
Homeతెలంగాణనాణ్యమైన వైద్యం.. డా. శ్రీకాంత్ రెడ్డికి ప్రజల ప్రశంసలు

నాణ్యమైన వైద్యం.. డా. శ్రీకాంత్ రెడ్డికి ప్రజల ప్రశంసలు

📰 Generate e-Paper Clip

తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. డా. శ్రీకాంత్ రెడ్డికి ప్రజల ప్రశంసలు బ్లాడర్‌లో రవ్వ లడ్డూ పరిమాణంలో రాయి గుర్తింపు.. నైపుణ్యంతో చికిత్స

హుజురాబాద్–జమ్మికుంట రోడ్:

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్–జమ్మికుంట రోడ్డులోని శ్రీ హాస్పిటల్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ డా. శ్రీకాంత్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారు. రోగుల ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చికిత్సను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పలువురు రోగులు, వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇటీవల ఓ రోగికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో బ్లాడర్‌లో రవ్వ లడ్డూ పరిమాణంలో రాయి ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితిని పరిశీలించిన డా. శ్రీకాంత్ రెడ్డి తన వైద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రోగికి అవసరమైన చికిత్సను అందించారు. చికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న డా. శ్రీకాంత్ రెడ్డిని పలువురు ప్రజలు అభినందించారు. వైద్య రంగంలో తన నైపుణ్యంతో పాటు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.

హుజురాబాద్–జమ్మికుంట రోడ్డులోని శ్రీ హాస్పిటల్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డా. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.