బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజరాబాద్ పట్టణంలోని స్థానిక కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ లో జ్ఞాన బోధకుడు చింత అనిల్ కుమార్ తాళ్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమము నిర్వహించి నారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే తన సౌభాగ్యంగా భావించి చింత అనిల్ కుమార్ గత కొన్ని నెలలుగా హుజురాబాద్ పట్టణంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అభినందించదగ్గ విషయం అన్నారు ధ్యానం అనేది మానసిక ప్రశాంతతను చేకూర్చడంతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడటమే కాకుండా ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ధ్యానము తోడ్పడుతుందని పేర్కొన్నారు నేటి యాంత్రిక యుగములో కలుషితమైన వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్న ప్రజలు ధ్యానం పట్ల ఆసక్తిని పెంపొందించుకొని ధ్యాన కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి అను నిత్యము ధ్యానము చేయవలసిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని సూచించినారు ధ్యానాన్ని ప్రాణంగా భావించే సద్గురు లాంటి ధ్యాన గురువులను ఆదర్శంగా తీసుకొని ప్రజలు ధ్యానము పట్ల ఆసక్తిని కలిగియుండి ఇదే ఫంక్షన్ హాల్ లో రోజువారి నిర్వహించు ధ్యాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆరోగ్యపరంగా సంపూర్ణ వికాసము పొందాలని ఆకాంక్షించినారు కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు మాము నూరి ప్రవీణ్ కుమార్ కొలిపాక క్రాంతి కుమార్ ఆకుల సదానందం కన్నెబోయిన రాజయ్య తో పాటు షీలా రాజేంద్రప్రసాద్ బజాజ్ రవీందర్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో ధ్యాన పరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు

