Tuesday, October 20, 2026
Homeతెలంగాణనరసయ్య నాటు మసాలా హోటల్ ప్రత్యేకత!

నరసయ్య నాటు మసాలా హోటల్ ప్రత్యేకత!

📰 Generate e-Paper Clip

పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం.. నరసయ్య నాటు మసాలా హోటల్ ప్రత్యేకత!

భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ: ఎలుకతుర్తి మండలం దండేపల్లి గ్రామం నుండి వచ్చిన నరెడ్ల జామారుతి ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే పంతంతో **జేఎన్‌డీఎస్ గ్రౌండ్ పక్కన, హనుమకొండలో “నరసయ్య నాటు మసాలా హోటల్”**ను ఏర్పాటు చేశారు.

ఈ హోటల్ ప్రత్యేకతగా కట్టెల పొయ్యిపై వండే రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా చేప కూర, నాటుకోడి మసాలా, చికెన్, చికెన్ బిర్యానీ మటన్ మటన్ బిర్యానీ బోటి తాజా కూరగాయలతో కూరగాయల భోజనంవంటి వంటకాలను సంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యిపై తయారు చేస్తారు.

ఆకలితో వచ్చే వారికి కడుపునిండా భోజనం అందించాలనే ఉద్దేశంతో కేవలం రూ.90కే భోజనం అందించడం ఈ హోటల్ ప్రత్యేకతగా నిలుస్తోంది. రుచికరమైన భోజనంతో పాటు సామాన్యులు, పేదలకు అందుబాటులో ఉండే ధరలో ఆహారం అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఆకలితో వచ్చినవారు కడుపునిండా తిని సంతోషంగా వెళ్లాలి” అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న నరెడ్ల జామారుతి సేవాభావాన్ని పలువురు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.