Tuesday, October 20, 2026
Homeతెలంగాణనీలి జెండాలతో నీలిమయమైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా*

నీలి జెండాలతో నీలిమయమైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా*

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ నీలి జెండాలతో నీలిమయమైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా*

 నీలి జెండా నీడలో అంబేద్కర్ భావజాలం సమానత్వానికి వెలుగు దారి చూపుతుందని అంబేద్కర్ గారి ఆలోచనలు ప్రతి మనిషికి గౌరవం , హక్కులు ,స్వేచ్ఛను అందించే మార్గదర్శకాలని రాజ్యాంగం మన చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్ )అధ్యక్షులు అన్నారు. ఈ సందర్భంగా సిద్దు రావణ్ గారు మాట్లాడుతూ నీలి రంగు కేవలం ఒక రంగు కాదని సమానత్వం, స్వేచ్ఛ ,న్యాయం కోసం నిలిచే సంకల్పానికి ప్రతీక అన్నారు. భీమ్ ఆర్మీ( భారత్ ఏక్తా మిషన్) సామాజిక న్యాయం సమానత్వం కోసం పనిచేసే ఉద్యమం అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కాన్షీరామ్ ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే భీమ్ ఆర్మీ ప్రధాన లక్ష్యాలలో ఒకటని… సమానత్వం, స్వేచ్ఛ ,న్యాయం, సోదర భావం … అనే రాజ్యాంగ విలువలతో ముందుకు సాగడమే భీమ్ ఆర్మీ ఎజెండా అని అన్నారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) వ్యవస్థాపక అధ్యక్షులు నగీన ఎంపీ అడ్వకేట్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారి మరియు జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ అధ్యక్షులు సిద్దు రావణ్ గారి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా కావలి శివకుమార్ గారిని నూతన కమిటీ గా నిర్మాణం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నర్సింలు ,రాచన్న బాలరాజ్ ఆగమయ్య పండరి, లక్మణ్ యువకులు మహిళలు భీమ్ ఆర్మీ సైనికులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.