Monday, October 19, 2026
Homeతెలంగాణఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి

ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి

📰 Generate e-Paper Clip

ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం.. బాధ్యులపై విచారణకు ఆదేశం

భీమ్ ఇండియా టుడే న్యూస్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమైన ఘటనగా సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం

అగ్నిప్రమాదం అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉంచాలని, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులు వచ్చినా వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ

రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ వార్డులో అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రమాదానికి కారణాలు, భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.

అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలి

భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా చిన్నారులు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులు ఉన్న వార్డుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు, అత్యవసర మార్గాలు, విద్యుత్ వ్యవస్థ తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రిమ్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల భద్రతపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.