Monday, October 19, 2026
Homeతెలంగాణమట్టి విగ్రహాల ప్రోత్సాహానికి ట్రైసిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమం

మట్టి విగ్రహాల ప్రోత్సాహానికి ట్రైసిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమం

📰 Generate e-Paper Clip

విగ్రహ దాత దంపతులకు ఘన సన్మానం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ  గణపతి విగ్రహ దాత గందె మమత రమేష్ గార్లకు,  సంస్కృతి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారికి, సంస్కృతి గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు, పెరుమాళ్ళ సుమలత శ్రీనివాస్ గౌడ్, గారికి ట్రై సిటీ అపార్ట్మెంట్ కమిటీ వారు సన్మానించడం జరిగింది: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ట్రైసిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు అపార్ట్మెంట్లను సందర్శిస్తూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసిన దాతలను అభినందిస్తూ సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మా సంస్కృతి అపార్ట్మెంట్‌లో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విగ్రహ దాతలు శ్రీమతి, శ్రీ గందె మమత–రమేష్ దంపతులను ట్రైసిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. దంపతులకు మెమొంటో, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రెంటాల కేశవ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. మట్టి విగ్రహాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు అపార్ట్మెంట్ వాసుల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైసిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ కోశాధికారి రాజకుమార్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, ఆర్గనైజర్ సెక్రటరీ అంజలి దేవి, మా సంస్కృతి అపార్ట్మెంట్ అధ్యక్షుడు చిట్టి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి సుంకిశాల తిరుపతిరావు, సంస్కృతి గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సుమలత శ్రీనివాస్ గౌడ్, సలహాదారు మంచాల రమేష్, జాయింట్ సెక్రటరీ ప్రసన్న, ఉపాధ్యక్షుడు గోవర్ధనం వెంకటాచారి, వెలవెందుల భాస్కర్ లింగం, అనుష పాపిరెడ్డి, డాక్టర్ శ్రీధర్, సుంకిశాల అనిత, మంచాల సుజాత, గోవర్ధన గోదా, డాక్టర్ అనూష, కల్లూరి అనిల్, దేవికి ఆనందం, జ్యోతి రాజిరెడ్డి, బుచ్చి రాజలింగం తదితరులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

అనంతరం డిస్ట్రిక్ట్ అపార్ట్మెంట్ డైరీలను మా సంస్కృతి అపార్ట్మెంట్ ప్రతినిధులకు అందజేశారు. పర్యావరణహిత మట్టి విగ్రహాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న ట్రైసిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ కార్యక్రమాన్ని అపార్ట్మెంట్ వాసులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.