Tuesday, October 20, 2026
Homeతెలంగాణప్రభుత్వానికి ఒకనెలలోనే రూ.18వేల కోట్ల రాబడి

ప్రభుత్వానికి ఒకనెలలోనే రూ.18వేల కోట్ల రాబడి

📰 Generate e-Paper Clip

ఖజానా గలగల!కాగ్ నివేదిక వెల్లడి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెలలోనే సుమారు 18వేల కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, గత ఆగస్టులో రూ.17,893 కోట్ల ఆదాయం సమకూరినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల కాలంలో రూ.77,535 కోట్లు వచ్చినట్టు ప్రకటించింది. కాగా, ప్రభుత్వ ఆదాయం సగటున నెలకు రూ.15,507కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం కాకుండా అప్పులు రూ.34,285 కోట్లు తీసుకొచ్చినట్టు వెల్లడించింది. జులైతో పోలిస్తే ఆగస్టులో అతి తక్కువగా అప్పులు తీసుకున్నది. నాన్హాక్స్ రెవెన్యూలోనూ జులైతో పోలిస్తే ఆగస్టులో ఆదాయం తక్కువ ఉన్నా… గతేడాది కంటే దాదాపు ఐదుశాతం వృద్ధి నమోదైంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వార్షికపరంగా చూస్తే గతేడాది కంటే రూ.30వేల కోట్లకుపైగా అధికాదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెసులుబాటు దొరుకుతుందని భావిస్తున్నారు. గత జూలైలో ప్రభుత్వానికి నాన్ టాక్స్ వె న్యూతో కలిసి రూ.17,117 కోట్ల ఆదాయం వచ్చింది. జులైలో నాస్టాక్స్ వెన్యూ రూ.1,577 కోట్ల మేర వచ్చింది. ఆగస్టులో మాత్రం రూ.1,201 కోట్ల ఆదాయం వచ్చినట్టు కాగ్వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన మూడేళ్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైనస్థితి ఉందని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. టాక్స్ రెవెన్యూలో 3.9శాతం, జీఎస్టీలో 4.78 శాతం, స్టాంప్స్ అండ్జిస్ట్రేషన్లలో 6.18శాతం, సేల్స్ టాక్స్ 3.83శాతం వృద్ధి నమోదైందని కాగిన నివేదికలో స్పష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.